ఉత్కంఠ పోరులో చెన్నైపై గుజరాత్ విక్టరీ

ఉత్కంఠ పోరులో చెన్నైపై గుజరాత్ విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో చెన్నైపై గుజరాత్ 3 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. డేవిడ్ మిల్లర్ (94) చివరి వరకు క్రీజులో ఉండి గుజరాత్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 7 వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో చెన్నైపై గుజరాత్ విక్టరీమిల్లర్ తో పాటు కెప్టెన్ రషీద్ ఖాన్ (40) వీరోచిత బ్యాటింగ్ చేశాడు. దీంతో గుజరాత్ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు చెన్నై ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో 3, తీక్షణ 2, ముకేష్, జడేజా చెరో వికెట్ తీశారు. క్రిస్ జోర్డాన్ (0/58) భారీగా పరుగులు సమర్పించడంతో చెన్నై ఓటమిబాట పట్టాల్సి వచ్చింది.