రణ్ బీర్- ఆలియా రిసెప్షన్..హాజరైన అతిథులు వీళ్లే

రణ్ బీర్- ఆలియా రిసెప్షన్..హాజరైన అతిథులు వీళ్లే

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : బాలీవుడ్ లవ్ అండ్ యంగ్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆలియా, రణ్ బీర్ పెళ్లి ఘనంగా జరిగిన విషయం విదితమే. అయితే తమ మ్యారేజ్ అనంతరం సినీ ప్రముఖులందరికీ వీళ్లు ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రణ్ బీర్- ఆలియా రిసెప్షన్..హాజరైన అతిథులు వీళ్లేఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖులంతా పాల్గొన్నారు. షారుక్ ఖాన్, గౌరీఖాన్, అర్జున్ కపూర్, మలైకా, తారా సుతారియా, బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా కపూర్, బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, రిషి కపూర్ సతీమణి నీతూ కపూర్ ఆమె కూతురు రిదిమా కపూర్, అల్లుడు భరత్ సాహ్నితో కలిసి మ్యారెజ్ రిసెప్షన్ లో సందడి చేశారు. వీరితో పాటు ఆలియా, రణ్ బీర్ కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.