‘కన్మణి రాంబో ఖతీజా’ ఫిలిం రిలీజ్ కు ఏర్పాట్లు
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నయన తార, సమంత హీరోయిన్స్‌గా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’. ఈ సినిమాను ఏప్రిల్ 28న భారీ లెవల్లో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన రెండు రెండు అనే పాటకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ చూస్తే కామన్ ఆడియెన్స్ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు.అంతకు ముందు విడుదలైన ‘న్మణి రాంబో ఖతీజా’ టీజర్, రీసెంట్‌గా విడుదలైన ‘టు టు..’ సాంగ్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను గాయత్రి దేవి ఫిలింస్ సంస్థ దక్కించుకుంది. ఏప్రిల్ 28న రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి గాయత్రి ఫిలింస్ అధినేత సతీష్ సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా : కన్మణి రాంబో ఖతీజా
నిర్మాణం : 7 స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్
నిర్మాత : లలిత్ కుమార్
రచన-దర్శకత్వం : విఘ్నేష్ శివన్
సంగీతం : అనిరుద్ రవిచంద్రన్
కెమెరా : ఎస్‌ఆర్ కదిర్
విజయ్ కార్తిక్ కన్నన్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ : వ్వేత సెబాస్టియన్
యాక్షన్ : దిలీప్ సుబ్బరాయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మయిల్‌వాగనన్ కె.ఎస్.
లైన్ ప్రొడ్యూసర్ : గుబేందిరన్ వీకే.
పి.ఆర్. ఓ : వంశీ కాకా