మే 1 నుంచి మెట్లు మార్గంలో భక్తులకు అనుమతి

మే 1 నుంచి మెట్లు మార్గంలో భక్తులకు అనుమతి

వరంగల్ టైమ్స్, తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త చెప్పింది. భక్తులకు మే ఒకటో తేదీ నుంచి శ్రీవారి మెట్లు మార్గంలో అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల మెట్ల మార్గం కొట్టుకుపోయాయి.ఈ మార్గంలో మరమ్మతులు పూర్తికావడంతో భక్తులకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.