కిడ్నాప్..సిద్దిపేటలో హత్య,13మంది అరెస్ట్

కిడ్నాప్..సిద్దిపేటలో హత్య,13మంది అరెస్ట్

వరంగల్ టైమ్స్, యాదాద్రి : పరువు హత్య కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ హత్యలో లతీఫ్‌తో పాటు ఆయన భార్య, మరో ఇద్దరు మహిళల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి లకుడారంలో రామకృష్ణ మృతదేహాన్ని వెలికితీశారు. కిడ్నాప్..సిద్దిపేటలో హత్య,13మంది అరెస్ట్లతీఫ్‌ గ్యాంగ్‌కు భార్గవి తండ్రి రూ. 10 లక్షల సుపారీ ఇచ్చారు. పరువు కోసం అల్లుడు రామకృష్ణను మామ వెంకటేష్‌ హత్య చేయించారు. భూమి చూపించాలంటూ రామకృష్ణను జిమ్మాపూర్‌ సర్పంచ్‌ భర్త అమృతరావు బయటకు తీసుకెళ్లారని రామకృష్ణ భార్య భార్గవి తెలిపారు. తిరిగి రాకపోవడంతో అమృతరావుకు ఫోన్‌ చేస్తే ఇంకా రాలేదా అని తననే ప్రశ్నించారని ఆమె చెప్పారు. లతీఫ్‌ అనే వ్యక్తి భూమి కొనుగోలు కోసం రామకృష్ణకు చాలా సార్లు ఫోన్‌ చేశాడని భార్గవి తెలిపారు. యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణకు లతీఫ్‌ను పరిచయం చేశాడని స్పష్టం చేశారు.

తమ ప్రేమ పెళ్లి నాన్న వెంకటేష్‌కు ఇష్టం లేదని భార్గవి తెలిపారు. పెళ్లి చేసుకున్నందుకు తనను కొట్టారని ఆమె చెప్పారు. రామకృష్ణను లతీఫ్‌ సాయంతో హైదరాబాద్‌ తీసుకెళ్లారని, రెండ్రోజుల నుంచి రామకృష్ణ ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌లో ఉందని భార్య భార్గవి పేర్కొన్నారు. కాగా యాదగిరిగుట్ట చెందిన భార్గవి వలిగొండ మండలం లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16 ప్రేమ వివాహం చేసుకున్నారు.

కొన్నిరోజుల పాటు లింగరాజుపల్లిలో ఉన్న రామకృష్ణ దంపతులు భార్గవి ప్రెగ్నెన్సీ రావడంతో భువనగిరిలో నివాసం ఉంటున్నారు. 6 నెలల క్రితం పాపకు భార్గవి జన్మనిచ్చారు. తుర్కపల్లి గుప్తా నిధులు కేసులో సస్పెన్షన్ గురైన రామకృష్ణ అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 15 న ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన భార్గవి డైల్ 100కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.