కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ప్రాణహిత పుష్కరాలు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని జ్ఞానేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కాళేశ్వరంలోని జ్ఞానేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి సుమారుగా 60 వేల మంది భక్తులు చేరుకొని స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులుకాళేశ్వరంలో భక్తుల కొరకు ప్రభుత్వ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని, ఎండాకాలంలో మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరాలు పెట్టి భక్తులను కంటికి రెప్పలా చూస్తున్నారని భక్తులు తెలిపారు. రవాణా సౌకర్యం కూడా చాలా బాగుందని భక్తులు తెలిపారు. ఈ రోజు దేవాలయంలో పూజలు, ప్రసాదాలపై (6,92,500) రూ. 6 లక్షల 92 వేల 500 ఆదాయం వచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.