‘ఖుషి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఖుషి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్వరంగల్ టైమ్స్,సినిమా డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ సినిమా’ఖుషి’.శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. విజయ్,సామ్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

అక్టోబర్ 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఓటీటీ దిగ్గజం ప్రకటించింది. ఓటీటీ రిలీజ్ పై పలు రూమర్స్ వస్తున్న నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఈ ప్రకటన చేసింది.ఇందులో నిడివి కారణంగా కట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా యాడ్ చేశారట.ముఖ్యంగా విజయ్, సామ్ లకు సంబంధించిన కొన్ని రొమాంటిక్ సీన్స్ ఇందులో చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.