‘శాకుంత‌లం’…ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

‘శాకుంత‌లం’...ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ ‘శాకుంత‌లం’… ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. పాన్ ఇండియా మూవీగా విడుదలకు సన్నద్ధమవుతోన్న అందమైన దృశ్య కావ్యం. యూ ట‌ర్న్‌, ఓ బేబి వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్న విజువ‌ల్ వండర్ ‘శాకుంత‌లం’. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. సోమ‌వారం ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి – గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ‘శాకుంతలం’ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని అప్ డేట్స్‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.

నటీనటులు: సమంత

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ : దిల్ రాజు
బ్యాన‌ర్స్ : డిఆర్‌పి – గుణ టీమ్ వ‌ర్క్స్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : గుణ శేఖ‌ర్‌
నిర్మాత : నీలిమా గుణ‌
సంగీతం : మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ : శేఖ‌ర్ వి.జోసెఫ్‌
మాట‌లు : సాయి మాధ‌వ్ బుర్రా
ఎడిటింగ్ : ప్ర‌వీణ్ పూడి
ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌: అశోక్‌
కాస్ట్యూమ్స్ డిజైనింగ్ : నీతా లుల్లా
పి.ఆర్.ఓ : వంశీ కాకా