‘ది కేరళ స్టోరీ’లో ఏముంది.. సినిమా రివ్యూ

‘ది కేరళ స్టోరీ’లో ఏముంది.. సినిమా రివ్యూ

'ది కేరళ స్టోరీ'లో ఏముంది.. సినిమా రివ్యూ

వరంగల్ టైమ్స్, సినిమా రివ్యూ: దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతోన్న ది కేరళ స్టోరి సినిమా నేడు విడుదలైంది. కేరళ సీఎంతో సహా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఈ సినిమాపై మండిపడ్డారు. టీజర్ , ట్రైలర్ విడుదలైన వెంటనే ఈ సినిమాను నిలిపివేయాలని, విడుదల చేయకూడదని కోరుతూ కేరళ హై కోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సినిమా విడుదలను ఆపేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల హెచ్చరికలు వచ్చినా, దేశవ్యాప్తంగా జరగుతున్న ఆందోళనలు, నిరసనల మధ్యనే ది కేరళ స్ోటరి సినిమా శుక్రవారం విడుదలైంది. కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తీశామని చెప్పుకుంటూ తెరకెక్కించిన ఈ సినిమా ది కేరళ స్టోరీ లవ్ జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, బోధనల వల్ల ముగ్గురు మహిళలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు.

ఈ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్, 138 నిమిషాల నిడివిలో ఉండే ఈ సినిమాలో నటీనటులు ఆదాశర్మ, యోగిత బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలు పోషించారు.తదితరులున్నారు.ముందుగా సినిమాలో ఎక్కడా కూడా 32,000 మంది కేరళ నుండి ఐఎస్ఐఎస్ టెర్రర్ గ్రూపులో చేరినట్లు చెప్పలేదు, చూపించలేదు. దర్శకుడు ముందే ఈ కథకి సంబంధించి బాగా రీసర్చ్ చేశాడనిపిస్తుంది. ఇక కథలోకి వస్తే ముగ్గురు నర్సింగ్ యువతులు బ్రెయిన్ వాష్ చేయబడి ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతారు. తరువాత బలవంతంగా ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ గ్రూపులోకి పంపబడతారు. ఎలాగో అలా ఐఎస్ఐఎస్ నుండి బయటపడి మన దేశంలోకి వస్తారు.

కానీ రాగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీస్ అధికారులకి తాము ఆ ముగ్గురు ఎలా వంచించబడి, ఎన్ని దుర్మార్గాలని అనుభవించాల్సి వచ్చిందో చెప్పడం మొదలు పెట్టడంతో సినిమా అసలు కథలోకి వెళ్లడం మొదలవుతుంది. సినిమా చూస్తున్నంత సేపు అలానే చూడాలనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే దర్శకుడు సుదీప్తో సేన్ మొదట నిజ సంఘటనలని బాగా స్టడీ చేశాకే కథని సిద్దం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది.

సంజయ్ శర్మ ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్, కలర్ బ్యాలెన్స్ అన్నీ కూడా బాగున్నాయంటున్నారు ఆడియన్స్.అయితే సినిమా చూసినంత సేపు, సినిమాలో ఒక్కటే లోపం ఉంది. అది సినిమాటోగ్రఫీ. అయితే లో బడ్జెట్ సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ లోపంగా కనిపించినా సినిమా ఇంట్రెస్ట్ తో చూడొచ్చు. సినిమాలో ఎక్కడా కూడా ప్రత్యేకించి ఒక వర్గాన్నీ కానీ, ఒక మతాన్ని కానీ కించపరిచే విధంగా సంభాషణలు కానీ దృశ్యాలు కానీ లేవు.అయితే సెన్సార్ బోర్డ్ వారు మొత్తం 10 సీన్లకి కట్ చెప్పిన తరువాతే సర్టిఫికెట్ ఇచ్చారు.కాబట్టి అలా కట్ అయిన వాటిలో ఏమన్నా ఉండి ఉండవచ్చు.

హింస,రేప్ దృశ్యాలు ఉన్నాయి కాబట్టి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు.హింస,రేప్ దృశ్యాలు లేకపోతే అది ఐఎస్ఐఎస్ టెర్రర్ గ్రూపుకి సంబంధించినది కాకుండా పూర్తి అవదు కాబట్టి అవి తప్పని సరి.ముఖ్యంగా ఆడ పిల్లలు ఉన్న తల్లి తండ్రులు తమ పిల్లలతో కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. లేకపోతే అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసే అవకాశం ఉండదు!