డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం: కలెక్టర్ నిఖిల

డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం: కలెక్టర్ నిఖిల

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా :సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జనగామ జిల్లాలో కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. జనగామ పట్టణంలోని 26వ వార్డులో ప్రారంభించిన శానిటేషన్ డ్రైవ్ లో అమ్మబాయ్ మార్కెట్ యార్డ్ లో చెత్తాచెదారాన్ని ప్రొక్లైనర్ సహాయంతో శుభ్రం చేశారు.డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం: కలెక్టర్ నిఖిలఅనంతరం 26వార్డు, 9వ వార్డులోని మురుగుకాలువలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వార్డుల్లో పారిశుధ్య పనుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పోకల జమున తమ వార్డుల్లోని మురుగుకాలువల పరిస్థితిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ నిఖిలకు వివరించారు.

దీంతో స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ నిఖిల మురుగు కాలువలను రీడెవలప్మెంట్ చేయుటకు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించుటకు మునిసిపల్ కమిషనర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్ రవిందర్ తదితరులు పాల్గొన్నారు.