పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీచండీగఢ్‌: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఎన్నికయ్యారు. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ పరిశీలకుడు హరీశ్ రావత్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పంజాబ్‌ సీఎంగా ఎస్సీ నేతకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. కాసేపట్లో పంజాబ్‌ గవర్నర్‌ను హరీశ్‌ రావత్‌, చరణ్‌జిత్‌ కలవనున్నారు.

ప్రస్తుతం చరణ్‌జిత్‌ సాంకేతిక విద్యామంత్రిగా ఉన్నారు. పంజాబ్‌ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ అనూహ్య రాజీనామాతో నూతన ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ శాసనసభాపక్షం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని కొత్త సీఎంగా ఎన్నుకుంది.