వింటర్ లో పెరుగు తింటే మంచిదా ?

వింటర్ లో పెరుగు తింటే మంచిదా ?

వింటర్ లో పెరుగు తింటే మంచిదా ?వరంగల్ టైమ్స్ హెల్త్ డెస్క్ : చలికాలంలో మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా త్వరగా అనారోగ్యానికి గురవడానికి కారణమవుతుంది. ముఖ్యంగా పెరుగు విషయంలో చాలామందికి డౌట్ ఉంటుంది. చలికాలంలో పెరుగు తినవచ్చా, తినకూడదా, తింటే ఎక్కడ జలుబు, దగ్గు వస్తుందో, ఏమవుతుందో అని అనుమానపడుతుంటారు.

అయితే చలికాలంలో డైట్ లో తప్పనిసరిగా పెరుగు చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‎ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. పాలలో కంటే పెరుగులో లాక్టోజు పరిమాణం తక్కువ. పాలోని లాక్టోజ్ సరిపడని కారణంగా పాలు, పాల ఉత్పత్తులు తిన్నప్పుడు జీర్ణాశయ ఇబ్బందులు పడేవాళ్లు కూడా పెరుగును హాయిగా తినవచ్చు.

పాలలో కన్నా పెరుగులో ప్రొటీన్లను శరీరం త్వరగా శోషించుకుంటుంది. చలికాలంలో పెరుగును చల్లగా తినడానికి ఇష్టపడకపోతే పగటి పూట చిక్కటి మజ్జిగగానో, కూర ముక్కలు వేసి రైతాలాగానో, రోటి పచ్చళ్లలో, కూరల్లో కలపడం ద్వారానో తీసుకోవచ్చు. ఏ కాలంలో అయినా కనీసం రోజుకు ఒక్కపూట పెరుగు తీసుకుంటే మంచిదని , ఇది అన్ని వయసుల వారికీ వర్తిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.