శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
వరంగల్ టైమ్స్, అమరావతి : కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న 66,577 మంది భక్తులు దర్శించుకోగా 31,471 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.3.97 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నెగెటితవ్ సర్టిఫికేట్ కానీ, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ తప్పకుండా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులు తమ ఆరోగ్యం, అదే విధంగా టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాలని కోరారు.