పెగాసస్ కొనుగోలు చేయలేదన్న నారా లోకేష్ 

పెగాసస్ కొనుగోలు చేయలేదన్న నారా లోకేష్

వరంగల్ టైమ్స్, అమరావతి : పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ పెగాసస్ పై చేసిన ప్రకటన ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొన్నారని బెంగాల్ సీఎం అసెంబ్లీలో వెల్లడించడంపై టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు. మమత వ్యాఖ్యలను మాజీ ఐటీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.పెగాసస్ కొనుగోలు చేయలేదన్న నారా లోకేష్ నాటి ప్రభుత్వం పెగాసస్ ను కొనుగోలు చేయలేదని ప్రకటించారు. కొనుగోలు చేసి ఉంటే ఇప్పటికే దొరికిపోయేవాళ్లమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ కొనుగోలు చేయలేదని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారని వెల్లడించారు. సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన ప్రతిని ఆయన విడుదల చేశారు.