ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం: దాస్యం

ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం: దాస్యం

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 60వ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

60 డివిజన్ పరిధిలోని బృందావన్ అపార్ట్మెంట్ నుండి గడిశె బడి మీదుగా 100 ‘ఫీట్ రోడ్డు వరకు రూ.1 కోటి 62 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు మరియు డ్రైన్ పనులకు చీఫ్ విప్ శంకుస్థాపన చేశారు. 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, 58వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు చీఫ్ విప్ శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్ల ప్రజలనుద్దేశించి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు.

ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం: దాస్యం

ప్రజలందరి సహకారంతోనే డివిజన్ అభివృద్ధి సాద్యమవుతుందని, కాబట్టి డివిజన్ ప్రజలు అభివృద్ధికి సహకరించి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుకోవడంలో భాగస్వాములు కావాలని దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంధంగా సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు రాంరాజ్, ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఓబీసీ అధ్యక్షులు నవీన్, మైనారిటీ అధ్యక్షులు అక్మల్, అఖీల్, కార్మిక కమీటీ అధ్యక్షులు భిక్షపతి, డివిజన్ నాయకులు సమ్మయ్య,అశోక్, నరేష్, సతీష్,వెంకటేశ్వర్లు,శివ, రాము, ప్రవీణ్, కూడా ఈ.ఈ భీం రావు, డి.ఈ రఘు, ఏ.ఈ భరత్ తదితరులు పాల్గొన్నారు.