తెలంగాణలో మే 6 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

తెలంగాణలో మే 6 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. తెలంగాణలో మే 6 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్మొదటి సంవత్సరం పరీక్షలు 6 నుంచి 23 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.

స్టియర్ షెడ్యూల్..
మే 6 – సెకండ్ లాంగ్వేజ్
మే 9 – ఇంగ్లీష్
మే 11 – మ్యాథ్స్ -ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 13 – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 16 – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 18 – కెమిస్ట్రీ, కామర్స్
మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1
మే 23 – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫీ

సెకండియర్ షెడ్యూల్
మే 7 – సెకండ్ లాంగ్వేజ్
మే 10 – ఇంగ్లీష్
మే 12 – మ్యాథ్స్ -ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 14 – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 17 – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19 – కెమిస్ట్రీ, కామర్స్
మే 21 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2
మే 24 – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫీ