భారత్ కు వచ్చిన 39 మందికి కరోనా  

భారత్ కు వచ్చిన 39 మందికి కరోనా

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ఆందోళనలు మరోసారి పెరుగుతున్నాయి. చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడి కోసం అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే కరోనా టెస్టులు నిర్వహిస్తున్నది. అయితే గడిచిన రెండ్రోజుల్లో భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా సోకిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.భారత్ కు వచ్చిన 39 మందికి కరోనా  ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును సందర్శించనున్నారు. ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం దాదాపు 6 వేల మందికి ర్యాండమ్ గా టెస్టులు నిర్వహించారు. ఎయిర్ పోర్టులో వచ్చీ వెళ్లే ప్రయాణికులందరికీ ర్యాండమ్ గా కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు కేంద్రం తెల్పింది.