నృసింహునిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

నృసింహునిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

నృసింహునిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

వరంగల్ టైమ్స్, మంగళగిరి : కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పానకాల స్వామిని దర్శించుకున్నారు. అనంతరం దిగువ సన్నిధిలో గల నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించగా ఆలయ ఈవో రామకోటిరెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పాతూరి నాగభూషణం, మాగంటి సుధాకర్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిది చందు సాంబశివరావు, సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు ,మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి నాగేంద్రం జగ్గారపు రాము, జగ్గారపు శ్రీనివాసరావు మరియు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.