పంత్ ను చూసేందుకు రావొద్దన్న డీడీసీఏ 

పంత్ ను చూసేందుకు రావొద్దన్న డీడీసీఏ

పంత్ ను చూసేందుకు రావొద్దన్న డీడీసీఏ వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీం ఇండియా స్టార్ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీడీసీఏ శర్మ పేర్కొన్నారు. పంత్ తన తల్లిని కలవడానికి ఇంటికి వెళ్తుండగా కారు డివైడర్ ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డెహ్రాడూన్ లోని మాక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. పంత్ తల, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతుందని డీడీసీఏ తెల్పింది. పంత్ ను కలిసేందుకు ఎవరూ ఆస్పత్రికి వెళ్లొద్దని అభిమానులతో పాటు వీఐపీలకు డీడీసీఏ విజ్ఞప్తి చేసింది. పంత్ ను కలిసేందుకు వెళ్తే అతనికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని, ఈ క్రమంలో కలిసేందుకు రావాలనుకునేవారు మానుకోవాలని సూచించారు.

బీసీసీఐ వైద్యులు, హాస్పిటల్ వైద్యులతో టచ్ లో ఉన్నారన్నారని డీడీసీఏ తెల్పింది. జై షా పరిస్థితి పర్యవేక్షిస్తున్నారన్నారు. కుటుంబీకులను కలిసేందుకు రూర్కీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని హరిద్వార్ రూరల్ ఎస్పీ ఎస్కే సింగ్ తెలిపారు. ఈ యాక్సిడెంట్ లో పంత్ తలకు గాయాలయ్యాయని, కుడి మోకాలు, కుడి మణికట్టు, కాలికి, చీలమండ, వీపుపై గాయాలున్నాయని బీసీసీఐ తెల్పింది.