బైరి నరేష్ అరెస్ట్

బైరి నరేష్ అరెస్ట్

వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. నేడు వరంగల్ లో అతను పోలీసులకు పట్టుబడ్డాడు. అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అయ్యప్పస్వాములతో పాలు పలువురు బైరి నరేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్పస్వాములు, పలువురు నిరసనలకు దిగి, ధర్నాలు చేశారు.బైరి నరేష్ అరెస్ట్ఇక ఏకంగా బైరి నరేష్ అనుచరుడు శంకర్ పై నడిరోడ్డుపై దాడికి దిగారు పలువురు. బైరి నరేష్ పై పలుచోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బైరి నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నేడు వరంగల్ లో పోలీసులు నరేష్ ను అరెస్ట్ చేశారు.