కార్మిక భవన్ మంజూరుపై సీఎంకు దాస్యం థాంక్స్

కార్మిక భవన్ మంజూరుపై సీఎంకు దాస్యం థాంక్స్

కార్మిక భవన్ మంజూరుపై సీఎంకు దాస్యం థాంక్స్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కార్మికుల సంక్షేమం,వారి అభ్యున్నతికై హనుమకొండ జిల్లాకు కార్మిక భవన్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో సీఎం కేసీఆర్ ను కార్మిక సంఘాల నాయకులతో కలిసి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

కార్మికుల ఆర్థిక అభివృద్ధి, వారి సంక్షేమం కొరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కార్మికులను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి ప్రతీ సంవత్సరం మే నెల మొత్తం నిర్వహిస్తున్న కార్మిక మాసోత్సావాలలో భాగంగా కార్మిక భవన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ని దాస్యం వినయ్ భాస్కర్ విన్నవించారు. దీనిపై కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ క్రమంలోనే నిన్న అసెంబ్లీ సమావేశాలలో ప్రతీ జిల్లాలో ఒక్క కార్మిక భవన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదించారు.

సీఎం కేసీఆర్ ని కలిసిన వారిలో కార్మిక నాయకులు, జాతీయ ఉద్యోగ సంఘాల ఉపాధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ , తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎంజాల మల్లేశం, హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎండీ సాదిక్ , ట్రై సిటీ అధ్యక్షులు భిక్షపతి, రఘపతి రెడ్డి, కొండయ్య, కృష్ణా ఉన్నారు.