మాజీ సీఎం కుమారుడికి షాకిచ్చిన బీజేపీ

మాజీ సీఎం కుమారుడికి షాకిచ్చిన బీజేపీఢిల్లీ : దివంగత మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కి బీజేపి మెుండి చెయ్యి చూపింది. దీంతో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు. మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన పనజి నియోజకవర్గం టిక్కెట్‌ను ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ ఆశించారు. ఇందుకోసం గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ బీజేపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన ఉత్పల్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పనజి నియోజకవర్గానికి 25 ఏళ్ల పాటు మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించారు.