మాస్క్ ఎవరికి తప్పనిసరి.. తేల్చి చెప్పిన కేంద్రం

మాస్క్ ఎవరికి తప్పనిసరి.. తేల్చి చెప్పిన కేంద్రంఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే మాస్కులు ధరించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు పిల్లలు మాత్రమే మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. ప్రతీ ఒక్కరూ మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించింది.