రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాస్పోర్ట్స్ డెస్క్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటుతున్నాడు. మొదటి రోజు 223 పరుగులకు టీంఇండియా ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడే అద్భుతమైన బౌలింగ్ తో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గార్ (3) పెవిలియన్ పంపిన బుమ్రా, రెండో రోజు ఆట మొదలైన తర్వాత మరో బ్యాటర్ ను బుట్టలో వేసుకున్నాడు. అతని బౌలింగ్ ను సరిగా అంచనా వేయలేకపోయిన ఎయిడెన్ మార్క్రమ్ 98) బౌల్డ్ అయ్యాడు. దీంతో సఫారీ జట్టు 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

అయితే నైట్ వాచ్ మెన్ గా బరిలో దిగిన కేశవ్ మహరాజ్ ( 16 నాటౌట్ ) చక్కగా ఆడుతున్నాడు. అతనికి కీగన్ పీటర్సన్ ( 2 నాటౌట్ ) జత కలిశాడు. కాగా, మొదటి రోజు ఆటలో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (79), వెటరన్ పుజారా (43) రాణించినా మిగతా బ్యాటర్లెవరూ ఆకట్టుకోలేదు. దీంతో టీంఇండియా జట్టు 223 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.