ఘోర రోడ్డు ప్రమాదం..53 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..53 మంది మృతి

వరంగల్ టైమ్స్, టక్స్ ట్లా గుటిరెజ్ : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్ లో వలసదారులతో వెళ్తున్న ట్రక్కు రిటైనింగ్ గోడను ఢీకొట్టింది. ఈప్రమాదంలో 53 మంది వలసదారులు మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.ఘోర రోడ్డు ప్రమాదం..53 మంది మృతిఈ ప్రమాదానికి గురైన వారంతా వలసకార్మికులని, సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. వలసకార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి చియాపాస్ లో రిటైనింగ్ గోడను ఢీకొని బోల్తా పడిందని తెలిపారు.

వాళ్లంతా ఏ దేశానికి చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు