రాజీ పాత్రకు అవార్డ్ అందుకున్న సామ్

రాజీ పాత్రకు అవార్డ్ అందుకున్న సామ్ముంబై : ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంతకు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ పెరిగింది. రాజీ అనే పాత్రలో సమంత తన నట విశ్వరూపం చూపించడంతో ఈ అమ్మడికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డు దక్కింది. ఆమె ముంబై వెళ్లి అవార్డుల వేడుకలో కూడా పాల్గొంది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రముఖులు సమంతకు విషెష్ తెలియచేస్తున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత…మనోజ్ బాజ్ పాయ్ కు దీటుగా రాజీ పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త సమంతను చూసి అభిమానులే కాదు, విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే రెబల్ గా సమంత జీవించిందనే చెప్పాలి.