చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘తీస్ మార్ ఖాన్’

చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'తీస్ మార్ ఖాన్'
హైదరాబాద్ : వరుస మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న చిత్రం తీస్ మార్ ఖాన్. RX 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై తన అందం అభినయంతో అందరిని మంత్ర ముగ్దులను చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.
విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ హై యాక్షన్ వోల్టేజ్  చిత్రం ను నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇక ఈ చిత్రం లోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.  బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
నటీనటులు :
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ :  తిరుమల రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్.ఒ : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు