హైదరాబాద్ లో కిలాడీ లేడీ అరెస్ట్

హైదరాబాద్ లో కిలాడీ లేడీ అరెస్ట్హైదరాబాద్ : మెడికల్ ఎమెర్జెన్సీ అని చెప్పి మోసాలకు పాల్పడుతున్న మహిళను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన మహిళను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కి చెందిన హేమలిగా పోలీసులు గుర్తించారు. ఈమె ఇతర వ్యక్తుల ఫోటోలను వాట్సప్ డీపీగా పెట్టుకొని వారికి మెడికల్ ఎమెర్జెన్సీ ఉందని స్నేహితులకు మెసేజ్ లు పెట్టి డబ్బులు దండుకోవడం అలవాటు చేసుకుంది.

అలవాటులో భాగంగానే ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఉందని అర్జంట్ గా డబ్బులు కావాలని వారి స్నేహితులకు మెసేజ్ పెట్టింది. దీంతో రూ. 2లక్షలు హేమలి అకౌంట్ కి వేసినట్లు బాధితుడు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో హైదరాబాద్ గోల్కొండకి చెందిన లవ్లీన్ కుమార్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ప్రకారం హేమలి కోసం వల వేసిన పోలీసుల ప్లాన్ సక్సెస్ అయ్యింది. బాధితుని ఫిర్యాదు మేరకు హేమలి అకౌంట్స్ వివరాల ఆధారంగా హేమలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.