తారకరత్న పార్థివదేహానికి ఎర్రబెల్లి నివాళి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సినీ హీరో నందమూరి తారక రత్న మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న ఇంటికి వెళ్లిన మంత్రి దయాకర్ రావు ఆయన పార్థివ దేహం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి కలిసిన వారిలో ఎంపీ విజయసాయి రెడ్డి, సినీ హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, తారక్ తండ్రి మోహన కృష్ణ, వారి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.