ప్రీతి ఫ్యామిలీకి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా

ప్రీతి ఫ్యామిలీకి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా

ప్రీతి ఫ్యామిలీకి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియావరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : మృత్యువుతో పోరాడి ఓడిన డాక్టర్ ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రీతి మరణం పట్ల సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, గంగుల కమలాకర్ , తదితర ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రీతి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అలాగే ప్రీతి కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వ పరంగా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ప్రీతి మరణానికి కారణమైన వారు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన విద్యార్థిని చనిపోయిందని తెలియగానే సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ర్యాగింగ్ వేధింపుల ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని సీఎం కేసీఆర్ తెలిపినట్లు మంత్రి దయాకర్ రావు వెల్లడించారు.