నేడు హనుమకొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలంలోని శోడషపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు రైతులకు సాగు నీరందించేందుకు రూ. 104 కోట్లతో చేపట్టిన మూడు మినీ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడతారు.