వృద్ధులకు మాస్కులు పంపిణీ చేసిన కలెక్టర్

వృద్ధులకు మాస్కులు పంపిణీ చేసిన కలెక్టర్

వరంగల్ టైమ్స్, హన్మకొండ జిల్లా : ప్రతీ ఒక్కరి ప్రాణాలతో చలగాటమాడుతున్న కరోనా వైరస్ ప్రభావాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం అవిరళ కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 70 యేళ్ల వయస్సు పైబడిన వారందరికీ మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుహసన్ పర్తి మండలం గుంటూరుపల్లిలో 8 రోజుల పాటు కొనసాగే శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు.వృద్ధులకు మాస్కులు పంపిణీ చేసిన కలెక్టర్ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1 లక్ష59 వేల 678 మందికి రెండేసి చొప్పున మొత్తం 3 లక్షల 19 వేల 356 మాస్కులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సర్పంచ్ లను, కార్యదర్శిలను ఆదేశించారు. ఇందులో భాగంగానే జిల్లాలో బి.పి. , షుగర్, డయాలిసిస్ , తలసేమియా, క్యాన్సర్ , కేమో తెరఫీ , టి.బి చికిత్స, తరచూ రక్త మార్పిడి చేపించుకుంటున్న వారికి, 70 ఏళ్ల వయస్సు పైబడిన వారికి కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి మాస్క్ లను రెండేసి చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.