జోరుగా సాగుతున్న సఫారీల బ్యాటింగ్

జోరుగా సాగుతున్న సఫారీల బ్యాటింగ్స్పోర్ట్స్ డెస్క్ : మూడో వన్డేలో కూడా సౌతాఫ్రికా టీం జోరు కొనసాగుతోంది. 25 ఓవర్ల ఆట ముగిసే సమయానికి పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఓపెనర్ జానెమన్ మలాన్ (1) విఫలమైనా మరో వెటరన్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ ( 81 నాటౌట్) అద్భుతంగా రాణిస్తున్నాడు. అతనికి ప్రొటీస్ కెప్టెన్ టెంబా బవుమా (80, ఎయిడెన్ మార్క్రమ్ ( 15) కొంత సేపు సహకారం అందించారు. ఇరువురు ఔటైన తర్వాత సూపర్ ఫాంలో ఉన్న రాసీ వాన్ డర్ డస్సెన్ ( 28 నాటౌట్ ) క్రీజులోకి వచ్చాడు.

వీళ్లిద్దరూ కలిసి చక్కగా బ్యాటింగ్ చేస్తుండటంతో సౌతాఫ్రికా జట్టు సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి 139/3 స్కోరుతో నిలిచింది. వీళ్ల బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే సఫారీలు భారీ స్కోరు సాధించి, టీం ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని నిలిపే అవకాశం ఉంది. టీంఇండియా బౌలర్లలో పేసర్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా, బవుమా రనౌట్ అయ్యాడు.