దేశానికే దిక్సూచిగా తెలంగాణ : చీఫ్ విప్ దాస్యం

దేశానికే దిక్సూచిగా తెలంగాణ : చీఫ్ విప్ దాస్యంహనుమకొండ జిల్లా : అభివృద్ధి పనులు, సంక్షేమ్ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నేడు హనుమకొండలోని 58వ డివిజన్ లక్ష్మీనగర్, శ్రీనగర్ కాలనీలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్ర భాగాన దూసుకెళ్తుందన్నారు. గత 60 యేళ్లుగా జరగని అభివృద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఆరేండ్లలో సాకారం అయ్యిందన్నారు.దేశానికే దిక్సూచిగా తెలంగాణ : చీఫ్ విప్ దాస్యంరాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చాలా తేడా ఉందన్నారు. ఇక్కడ కూలీ పని చేసుకునే వాళ్ల దగ్గర నుంచి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు నివసిస్తున్నారని చీఫ్ విప్ పేర్కొన్నారు. కాలనీ పెద్దల సమక్షంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ అభివృద్ధిలో అధికారులు పాత్ర అభినందనీయమన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ వారికి సేవ చేసుకునే అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు దాస్యం వినయ్ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు దాస్యం సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, మాజీ కార్పొరేటర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.