హనుమకొండ జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్

హనుమకొండ జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్

హనుమకొండ జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్త ఐఏఎస్ ల కలెక్టర్ గా పనిచేస్తున్న సిక్తా పట్నాయక్ ను హనుమకొండకు బదిలీ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిక్తా పట్నాయక్ 1987లో జన్మించారు. 2014 లో ఐఏఎస్ సర్వీసుల్లోకి వచ్చిన ఆమె పెద్దపల్లి, ఆదిలాబాద్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి హనుమకొండకు బదిలీపై వచ్చారు. రెండ్రోజుల్లో ఆమె హనుమకొండ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

తెలంగాణలో రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను హనుమకొండకు,హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును నిజామాబాద్ కు బదిలీ చేసింది.