డబ్ల్యూహెచ్ వో వార్నింగ్..తప్పకుండా చదవాల్సిందే

డబ్ల్యూహెచ్ వో వార్నింగ్..తప్పకుండా చదవాల్సిందే

జెనీవా : కరోనా మహమ్మారి ఇప్పట్లో నశించిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయన్న అపోహలను వీడాలన్నారు. రికార్డు స్థాయిలో యూరోప్ దేశాల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెడ్రోస్ మరోసారి వార్నింగ్ జారీ చేశారు. మంగళవారం ఒక్క రోజే ఫ్రాన్స్ లో సుమారు 5 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఇక బుధవారం తొలిసారి జర్మనీలో ఏకంగా లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్తగా సుమారు 2 కోట్ల పాజిటివ్ కేసులు నమోదైనట్లు డెడ్రోస్ వెల్లడించారు. ఒమిక్రాన్ తో స్వల్ప లక్షణాలే కల్గుతాయన్న తప్పుడు వార్తలతో, ఈ వేరియంట్ వ్యాప్తి మరింత వేగం పుంజుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరూ తప్పు చేయవద్దన్నారు, ఒమిక్రాన్ వల్ల హాస్పిటల్ లో చేరుతున్నవారి సంఖ్య , మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఒమిక్రాన్ దూసుకెళ్తున్న తీరు ఆందోళన కల్గిస్తోందన్నారు. దాని వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశాలున్నాయన్నారు.

అందుకే వైరస్ ను కట్టడి చేయాలని టెడ్రోస్ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ వేగంగా లేని దేశాలు ఆందోళన కల్గిస్తున్నట్లు చెప్పారు. అతివేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీస్ డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు.