యాదాద్రిని ద‌ర్శించుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి

యాదాద్రిని ద‌ర్శించుకున్న మంత్రి ఎర్ర‌బెల్లియాదాద్రి భువనగిరి జిల్లా : శ్రీ యాద‌గిరి ల‌క్ష్మీనర్సింహ‌స్వామి రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగ‌తం ప‌లికి, ఆశీర్వ‌చ‌నం, స్వామివారి ప‌ట్టు వ‌స్త్రాల‌ను అంద‌చేశారు. త‌మ ఇల‌వేల్పు అయిన ల‌క్ష్మీనర్సింహ స్వామి వారిని త‌ర‌చూ ద‌ర్శించుకుంటామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకున్న‌ట్లు మంత్రి దయాకర్ రావు తెలిపారు.
.