కేటీఆర్ తో వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధం: మేయర్

 

కేటీఆర్ తో వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధం: మేయర్

వరంగల్ అర్బన్ : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధంగా ఉండాలని నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి లు కార్పొరేటర్ లను కోరారు. బుధవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ లతో సమావేశమై, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చే గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగర మేయర్ లు, అదనపు కలెక్టర్ లు, మునిసిపల్ కమిషనర్ లు, కార్పొరేటర్ లతో టీ.ఎస్.బి పాస్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లందరూ హాజరవడంతో పాటు సీజనల్ వ్యాధులు డివిజన్లలో ప్రబలకుండా తీసుకొంటున్న చర్యలు, ఆన్లైన్లో కొత్త భవనాల నిర్మాణం అనుమతి మంజూరిపై అవగాహన కలిగి ఉండాలని మేయర్ , జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కార్పొరేటర్లకు సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ లు, తదితరులు పాల్గొన్నారు.కేటీఆర్ తో వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధం: మేయర్