ఫ్యామిలితో పుట్టిన‌రోజు జ‌రుపుకున్న శిరీష్

ఫ్యామిలితో పుట్టిన‌రోజు జ‌రుపుకున్న శిరీష్

హైదరాబాద్: యంగ్ హీరో అల్లు శిరీష్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా కుటంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులుతో క‌లిసి కేక్ క‌ట్ చేశారు. క‌రోనా నేప‌థ్యంలో త‌న పుట్టిన రోజు వేడుక‌లకు దూరంగా ఉన్నారు శిరీష్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమ‌ణి అల్లు స్నేహా రెడ్డి స్వ‌యంగా త‌యారు చేసిన కేక్ ని శిరీష్ క‌ట్ చేయ‌డం విశేషం. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ట్విట్టర్ ద్వారా శిరీష్ కి శుభాకాంక్షలు తెలిపారు. యూ ఆల్వేస్ బీ మై బెస్ట్ బేబీ ఇన్ థిస్ వరల్డ్ అంటూ ట్వీట్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక వైవిధ్య‌మైన క‌థ‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు అల్లు శిరీష్. కొత్త జంట‌, శ్రీర‌స్తు శుభ‌స్తు, ఒక్క క్ష‌ణం వంటి సూప‌ర్ హిట్ సినిమాలు శిరీష్ ఖాతాలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అల్లు శిరీష్ త‌దుప‌రి సినిమా పై సినీ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కీల‌క‌ ప్ర‌క‌ట‌ణ‌తో పాటు మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల కాబోతున్నాయి.