అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపు

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపున్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య మరోసారి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై సస్పెన్షన్ ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం పేర్కొంది.

ఇంతకు ముందు డిసెంబర్ లో జనవరి 31 వరకు నిషేధాన్ని పొడిగించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న క్రమంలో తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఎయిర్ బబుల్ ఒప్పందాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని ఇంతకు ముందు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.