చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్

చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్

వరంగల్ టైమ్స్, చైనా : డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది. దేశంలో ఆపరేట్‌ అవుతున్న 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు కూడా ఎన్నో చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం, మరోసారి 232 యాప్‌లను కూడా బ్యాన్ చేసింది. వీటిలో 138 బెట్టింగ్‌ యాప్‌లు, 94 లోన్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరునెలల క్రితమే చైనా యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది.