మహారాష్ట్రకు నీళ్లు ఇవ్వడానికి మేం సిద్ధం

మహారాష్ట్రకు నీళ్లు ఇవ్వడానికి మేం సిద్ధం

మహారాష్ట్రకు నీళ్లు ఇవ్వడానికి మేం సిద్ధం

వరంగల్ టైమ్స్, మహారాష్ట్ర : మహారాష్ట్ర నేతలను ఒప్పించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. నాందేడ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మహారాష్ట్ర సహకరాంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైందన్నారు. గోదావరిలో 2 నుంచి 3 వేల టీఎంసీల వరద పారుతుంది. గోదావరి నుంచి వృధాగా పోతున్న నీళ్లను సద్వినియోగం చేసుకోవాలని చెప్పాం. మూడు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి, గోదావరి జలాల సమస్య పరిష్కరించలేదా ? అని అన్నారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు.

తాము మహారాష్ట్రకు మనస్ఫూర్తిగా నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై ఏకంగా పుస్తకాలే వచ్చాయి. పాలకులే అనుసరించడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. బాబ్లీ ప్రాజెక్ట్ పేరుతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలతో డ్రామా ఆడారు. అసలు ప్రాజెక్టు విషయంలో వివాదమే లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఇక వివాదం ఎక్కడిది ? అని కేసీఆర్ అడిగారు.