తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు గడువును పొడిగించింది. ఇటీవల వచ్చిన సెలవుల దృష్ట్యా, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 10 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును స్వీకరించనున్నారు. రూ. 200 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 16 వరకు, రూ. 1000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 23 వరకు, రూ. 2వేల అపరాధ రుసుముతో మార్చి 2 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.