హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, సీఎస్ సోమేశ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. మొదట పఠాన్ చెరులోని స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరిస్తారు. అనంతరం ముచ్చింతల్ లో ని ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోడీ, చినజీయర్ స్వామితో కలిసి పూజచేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమివ్వనున్నారు.  అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఆయన జ్వరం, స్వల్ప అస్వస్థతతో బాధపడటంతో ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోడీకి స్వాగతం, వీడ్కోలు పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.