పెండింగ్ పనులు పూర్తి చేయండి : ఎమ్మెల్యే చల్లా

పెండింగ్ పనులు పూర్తి చేయండి : ఎమ్మెల్యే చల్లావరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని ఆయన స్వగృహంలో పరకాల నియోజకవర్గంలోని ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో వెంకటేశ్వరపల్లి, లక్ష్మీపురం, నీరుకుళ్ల గ్రామాల శివారులో చేపట్టిన చెక్ డ్యాం నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని చల్లా ధర్మారెడ్డి సూచించారు.

అదే విధంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో గ్రామాల్లో చెరువులకు అనుసంధానంగా ఉండే పిల్ల కాలువలు, ఎస్సీరెస్పీ కాలువల మరమ్మత్తులు చేపట్టి, ముళ్లపొవదల్ని తొలగించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఎస్సారెస్పీ కాలువలు, భూములు ఆక్రమణకు గురికాకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆయన ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షాసమావేశంలో ఈఈ రామ్మోహన్, డీఈ లు, ఏఈ.లు తదితరులు పాల్గొన్నారు.