సోహేల్ నూతన చిత్రం ప్రారంభం

సోహేల్ నూతన చిత్రం ప్రారంభంవరంగల్ టైమ్స్ , సినిమా డెస్క్ : మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో యువ కథానాయకుడు సోహైల్ హీరో గా *కాకతీయ ఇన్నోవేటివ్స్ & దొండపాటి సినిమాస్* సంస్థలు కలిసి నిర్మిస్తున్న మొదటి చిత్రం పూజ కార్యక్రమం యాదాద్రి లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సినిమా కంటెంట్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది… దర్శకులే నిర్మాతలైతే కంటెంట్ పై ఏంత కసరత్తు జరుగుతుందనేది నిదర్శనమే ఈ కాన్సెప్ట్..హైదరాబాద్లో జరిగి షూటింగ్ షెడ్యూల్లో మిగతా వివరాలు వెల్లడిస్తాము..