షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ పై స్పందించిన సిరి

షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ పై స్పందించిన సిరి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తుండగానే అందరికీ అనిపించింది ఒక్కటే.. సీజన్ అయిపోగానే షణ్మఖ్ జస్వంత్, దీప్తి సునయన మధ్య ఏదో జరుగుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. సిరితో షణ్ముఖ్ సన్నిహితంగా ఉండటమే దీనికి కారణమవుతుందని ఊహించారు. అయితే ఫ్యాన్స్ ఊహించినట్లుగానే నూతన సంవత్సరం రోజే దీప్తి సునయన..షణ్ముఖ్ జస్వంత్ కు షాక్ ఇచ్చింది.షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ పై స్పందించిన సిరితనకు బ్రేకప్ చెప్తూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ గా లెటర్ తో పోస్ట్ చేసింది సునయన. అయితే వీళ్లిద్దరూ విడిపోయింది మొదలు, దీనికి కారణం సిరినే అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా దీనిపై సిరి హన్మంత్ స్పందించింది. దీప్తి సునయన, షణ్ముఖ్ విడిపోవడానికి నేనే కారణమంటూ ట్రోల్స్ రావడంతో డిప్రెషన్ కు గురయ్యానని సిరి ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్లిద్దరి బ్రేకప్ కి తాను కారణం కాదని వెల్లడించింది.

బిగ్ బాస్ హౌస్ లో వంద రోజుల ప్రయాణంలో కంటెస్టెంట్స్ మధ్య ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అయితే షణ్మఖ్ కి , నాకు మధ్య ఆ ఎమోషన్స్ ఎక్కువయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో షణ్మఖ్, జెస్సీ నాకు మంచి ఫ్రెండ్స్ . రవి ఒక సోదరుడిలా ఉన్నాడు. షణ్ముఖ్ నాకు మంచి ఫ్రెండ్. దీప్తి కూడా నాకు ఫ్రెండే. వాళ్లిద్దరితోనూ నేను కలిసి వర్క్ చేశాను. కానీ వాళ్లిద్దరూ నా వల్లే విడిపోయారని అనడం వాస్తవం కాదు. వాళ్లది కేవలం 100 రోజుల్లోనే విడిపోయేంత వీక్ ప్రేమ కాదని సిరి చెప్పుకొచ్చింది.