ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే చల్లా

ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే చల్లా

ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే చల్లావరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ధర్మారంలోని 75 యేళ్ల జెడ్పీహెచ్ స్కూల్ పాత భవనాన్ని తీసివేసి దాదాపు రూ.85 లక్షలతో నూతనంగా 12 అదనపు తరగతులను నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. జీడబ్ల్యూఎంసీ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామం జెడ్పీహెచ్ స్కూల్ లో నిర్వహిస్తున్న ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం రూ.60 లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్లాటినం జూబ్లీ సందర్భంగా రక్తదానం చేసిన సుమారు 100 నుంది పూర్వ విదార్థులకు ఎమ్మెల్యే చల్లా అభినందనలు తెలిపారు. రక్త దానం చేయడం వలన మరొక్కరికి ప్రాణం దానం చేయడంతో సమానమని ఆయన అన్నారు. ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న అల్యూమిని ప్రెసిడెంట్ గాదె దయాకర్ కి మరియు ఇతర ఆహ్వాన కమిటీ, పూర్వ విద్యార్థులందరినీ చల్లా అభినందించారు.

రాజకీయ చైతన్యం కలిగిన ఊరు ధర్మారం , అలాంటి ధర్మారం గ్రామంలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలసి ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ధర్మారం పాఠశాల నందు దాదాపు 25 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులుగా సేవలందించి ఎంతో మంది విద్యార్థులను గొప్ప స్థాయికి తీర్చి దిద్దిన గౌ:నర్సింహరెడ్డి సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు విస్తరణలో భాగంగా పాఠశాల భవనం పోతుంది కావున అదనపు తరగతులు తప్పకుండా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చల్లా ఈ సందర్భంగా హామి ఇచ్చారు. గతంలో ఈ పాఠశాలకు ఉచితంగా కంప్యూటర్ లను అందజేయడం జరిగిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివ కుమార్ మరియు 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు, మార్కెట్ డైరెక్టర్ గోలి రాజయ్య, ప్లాటినం జూబ్లీ నిర్వహణ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.