రైతులపై అడవి పంది దాడి

రైతులపై అడవి పంది దాడి

రైతులపై అడవి పంది దాడివరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా : రైతులపై అడవి పంది దాడి చేయడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి గ్రామంలో చోటు చేసుకుంది. కార్లయి గ్రామంలోని వీరంపేటకు చెందిన మంకిడి లక్ష్మీపతి, పెనుక సురేందర్ లు ఉదయం వారి మొక్క చేనులో కంకులు విరుస్తున్నారు. వారి కంకులు విరిచే పనిలో పడగా వారి పైన ఒక్కసారిగా అడవి పంది దాడి చేసింది. దీంతో వారిద్దరూ తీవ్రగాయాలపాలయ్యారు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అడవి పంది దాడిలో గాయపడిన రైతులను చికిత్స నిమిత్తం కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించారు.