10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బషీర్ బాగ్ లోని ఎస్సీఈఆర్టీలో విడుదల చేశారు. సబితాఇంద్రారెడ్డితో పాటు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు 86.60 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.

బాలికలు 88.53శాతం ఉత్తీర్ణత శాతం నమోదు సాధించినట్లు వారు తెలిపారు. బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు బాలుర కంటే 3.85శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేట్ విద్యార్థులు 44.51 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, ఇందులో బాలికలు 47.73 శాతం, బాలురు 43.06శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాలను https://results.tsbse.telangana.gov.in., https//results.tsbsetelangana.orgతో పాటు www.ntnews.com వెబ్ సైట్ లలో చూసుకోవచ్చు. ఈ సంవత్సరం ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించిన పదవ తరగతి పరీక్షలకు 4.4 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.